- Home
- tollywood
కేజీఎఫ్ 2 వైపు ఎవరు వెళ్తారంటూ బన్ని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సవాల్!
కేజీఎఫ్ 2 రిలీజ్ గురించి డిస్కషన్ జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా జూలై 16 న ఫిక్స్ చేసారు. అయితే ఇప్పుడున్న పరిస్దితుల్లో ఆ తేదీన రిలీజ్ అవటం కష్టం. దాంతో ఆ టీమ్ దసరా కు రిలీజ్ చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ అవుతున్నట్లుగా మీడియాలో హంగామా మొదలైంది. అయితే అదే రోజున అల్లు అర్జున్ పుష్ప రిలీజ్ ఉంది. కేజీఎఫ్ 2 వైపు ఎవరు వెళ్తారంటూ బన్ని ఫ్యాన్స్ కొందరు సోషల్ మీడియాలో సవాల్ విసురుతున్నారు. అల్లు అర్జున్ సినిమా ఉంటే దాన్ని వదిలేసి కన్నడ డబ్బింగ్ సినిమాకు ఎవరు ఎగబడతారు. అయితే అదే సమయంలో కేజీఎప్ కు ఉన్న క్రేజ్ కూడా మామూలుగా లేదు. థియేటర్లలో వసూళ్ల సునామీ కురిపించేందుకు మరీ ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. కాబట్టి టైమ్ అనేదే ముఖ్యం కేజీఎఫ్ పుష్ప ఢీకొట్టే ఛాన్స్ లేదంటున్నారు సినీ విశ్లేషకులు. ఆ టైమ్ కు ఖచ్చితంగా కేజీఎఫ్ వెనక్కు తగ్గుతుంది. లేదా ఇప్పుడే నిర్ణయం మార్చుకుంటుంది.ఇప్పుడు జరుగుతున్న ఈ డిస్కషన్ ఖచ్చితంగా కేజీఎఫ్ టీమ్ ని ఆలోచనలో పడేస్తుంది. కేజీఎప్ 2 కనుక కలెక్షన్స్ తగ్గితే ..అది దర్శకుడు ప్రశాంత్ నీల్ కెరీర్ పై ఇంపాక్ట్ పడుతుంది.