ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగిపోయిందా.. : సోనూసూద్

Admin 2021-05-13 16:05:22 entertainmen
సోనూసూద్ ఎక్కువగా విలన్ రోల్స్ పోషించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.బ్లాక్ బస్టర్ అరుంధతి సినిమాలో చేసిన పశుపతి పాత్రతో కోట్లాది ప్రేక్షకులకు సుపరిచితుడు అయ్యాడు. అయితే సినిమాల్లో విలన్ అయినప్పటికీ సోనూసూద్ నిజజీవితంలో మాత్రం నిజంగానే హీరో అనిపించుకున్నాడు. కరోనా టైంలో ఎవరెన్ని సేవలు చేసినా సోనూసూద్ చేసిన సేవలు ఎవరు చేయలేరు. సోనూసూద్ సహాయం పొందినవారి వారి దృష్టిలో ఇప్పుడు దేవుడు అయిపోయాడు. దేశ ప్రజల దృష్టిలో నిజమైన హీరోగా గతేడాది కాలంగా తనకు చేతనైంది సాయం చేస్తూ ప్రతి ఒక్కరికి కాదనకుండా సేవలు అందిస్తూనే ఉన్నాడు. సేవలు చేస్తూ ప్రజల మనసు గెలుచుకున్న సోనూసూద్ క్రేజ్ రోజురోజుకి మరింత పెరిగిపోతుంది. ప్రస్తుతం సోనూసూద్ రెమ్యూనరేషన్ కూడా ఓ రేంజిలో పెరిగిందని టాక్. ఇప్పుడు సోనుతో సినిమా చేయాలంటే కోట్లలోనే పారితోషికం ఎక్సపెక్ట్ చేస్తున్నాడట. విలన్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటున్న సోనుకు తెలుగులో సినిమా చేయాలంటే నిర్మాతలు కోట్లు చెల్లించుకోవాల్సిందే అంటున్నాయి సినీవర్గాలు. అయితే హీరో క్యారెక్టర్స్ ఆఫర్స్ వస్తున్నప్పటికి సోనూసూద్ విలన్ పాత్రలకే ఓకే చెబుతుండటం గమనార్హం. ఇటీవలే అల్లుడు అదుర్స్ అనే సినిమాలో కనిపించిన సోను.. ఆ మధ్యలో తన బయోపిక్ లో తానే నటిస్తానని చెప్పాడు.