- Home
- tollywood
చరణ్ 15వ సినిమాకి సన్నాహాలు...
శంకర్ సినిమాల్లో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి .. అలాగే ఎమోషన్స్ కూడా ఉంటాయి. అయితే ఈ సినిమాలో కథాపరంగా ఎమోషన్స్ కి పెద్దపీట వేయడం జరిగిందని అంటున్నారు. ఇక చరణ్ తరహా ఫైట్లు .. డాన్సులు మామూలే. ఎమోషన్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంటుందని చెబుతున్నారు. ఇది కూడా పాన్ ఇండియా సినిమా కావడంతో, మెగా అభిమానులు మరింత ఆసక్తితో ఉన్నారు. ఈ సినిమా కోసం భారీ సెట్లు కూడా వేయనున్నట్టుగా చెప్పుకుంటున్నారు. చరణ్ కి ఇది 15వ సినిమా కాగా, నిర్మాతగా దిల్ రాజూకి 50వ సినిమా కావడం విశేషం.