మూడు ప్రాజెక్టులతో బిజీ కృతి శెట్టి!

Admin 2021-05-19 13:44:22 entertainmen
'ఉప్పెన' సినిమాతో బ్యూటీ కృతి శెట్టి కుర్రాళ్ల మనసులను దోచేసింది. భారీ విజయంతో పాటు .. రికార్డు స్థాయి వసూళ్లకు కారణమైంది. దాంతో యంగ్ హీరోలంతా కూడా ఈ అమ్మాయి తమ సినిమాకి ప్లస్ అవుతుందనే ఉద్దేశంతో ఉత్సాహం చూపుతున్నారు. సుందరికి తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీ నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయనే టాక్ వచ్చింది. అక్కడ కూడా బిజీ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా కృతి శెట్టి మాట్లాడుతూ, ప్రస్తుతం తన చేతిలో ఉన్నవి మూడు సినిమాలు మాత్రమేనని చెప్పింది. నాని హీరోగా 'శ్యామ్ సింగ రాయ్'తో పాటు సుధీర్ బాబు .. రామ్ సినిమాల్లో మాత్రమే నటిస్తున్నానని స్పష్టం చేసింది. తాను ఏ సినిమాలు చేయడం లేదనీ, ఒకవేళ ఒప్పుకుంటే ఆ విషయాన్ని తాను తెలియజేస్తానని చెప్పింది. ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా ఈ మూడు ప్రాజెక్టులపైనే ఉందనీ, అవి పూర్తయిన తరువాతనే వేరే ప్రాజెక్టులను గురించిన ఆలోచన చేస్తానని అంది. మరి ఈ మూడు సినిమాల తరువాత కృతి ఏయే ప్రాజెక్టులలో కుదురుకుంటుందో చూడాలి.