- Home
- tollywood
కరోనా బాధితుల సహాయార్థం నిధి విరాళం
కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎంతో మంది దీని బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. ప్రతి రోజు ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. హీరోయిన్ నిధి అగర్వాల్ కూడా తన వంతు సాయం అందించింది. తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్ కు లక్ష రూపాయల విరాళాన్ని అందజేసింది. అంతే కాదు 'ఫైండ్ ఏ బెడ్'కు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. నిధి తమిళ సినీపరిశ్రమకు దగ్గరైంది. ఆమె నటించిన రెండు చిత్రాలు ఈమధ్యనే విడుదలయ్యాయి. ఇక తెలుగులో తాజాగా పవన్ కల్యాణ్, క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'హరిహర వీరమల్లు'లో నటిస్తోంది.