- Home
- tollywood
పవన్ తో మూడో సినిమాకి సన్నాహాలు : బండ్ల గణేశ్
పవన్ .. బండ్ల గణేశ్ కాంబినేషన్లో మరో సినిమా రానున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే తనతో సినిమా చేస్తానని పవన్ మాట ఇచ్చాడనీ, కానీ ఇంకా తాను అందుకు సంబంధించిన పనులను మొదలుపెట్టలేదని గణేశ్ అప్పుడే చెప్పాడు. ఈ నేపథ్యంలో రమేశ్ వర్మ ఒక కథతో పవన్ ను ఒప్పించాడనీ, ఆ సినిమాకి నిర్మాత గణేశ్ అనే వార్త షికారు చేస్తోంది. ఈ విషయంపై తాజాగా స్పందించిన గణేశ్, ఈ వార్తలో నిజం లేదని స్పష్టం చేశాడు. పవన్ తో సినిమా ఓకే కాగానే తానే వెల్లడి చేస్తానని అన్నాడు.