- Home
- bollywood
చాలా అసభ్యంగా ప్రవర్తించేవాడు : : బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఎంత దారుణంగా ఉంటుందో ఇప్పటికే పలువురు మహిళా ఆర్టిస్టులు తమ అనుభవాలను వెల్లడించారు. 'మీటూ' ఉద్యమం సమయంలో ఎందరో సినీ ప్రముఖుల భాగోతాలు వెలుగులోకి వచ్చాయి. బాలీవుడ్ లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుంది.ఓ కాల్ సెంటర్ లో పని చేస్తూ తాను బాలీవుడ్ అవకాశాల కోసం ప్రయత్నించానని... బాలీవుడ్ కు వచ్చిన తొలినాళ్లలో తనకు ఓ దర్శకుడు పరిచయం అయ్యాడని... ఎంతో మంచి వ్యక్తిలా తనతో మాట్లాడేవాడని జరీన్ తెలిపింది. తనను దారిలోకి తెచ్చుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నించాడని తెలిపింది. సినిమా ఆఫర్లను తెప్పించే బాధ్యత తనదే అని చెపుతూ, తనను నమ్మించే ప్రయత్నం చేశాడని చెప్పింది. ఆ తర్వాత అతని బారి నుంచి తాను తప్పించుకున్నానని తెలిపింది. సల్మాన్ సరసన బాలీవుడ్ లో అరంగేట్రం చేసిన జహీర్ ఖాన్.. ఆ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది.