మలయాళ సినిమాలో ఈషా రెబ్బాకి ఛాన్స్!

Admin 2021-06-14 15:11:12 entertainmen
తెలుగు తెరపై కథానాయికగా తెలుగు అమ్మాయి రాణించడం కష్టమే. వివిధ భాషల్లో నుంచి ఇక్కడికి వస్తున్న గ్లామరస్ హీరోయిన్స్ ధాటిని తట్టుకుని నిలబడటం తేలికేం కాదు. అయినా ఈషా రెబ్బా తన సత్తా చాటడానికి తగిన ప్రయత్నాలు చేస్తూనే ఉంది. 'అరవింద సమేత'లో మెరిసిన ఈ సుందరి, 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమాలోను సందడి చేయనుంది. ఈ సినిమాపై ఆమె గట్టి ఆశలనే పెట్టుకుంది. తమిళంలో కుదురుకోవడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తున్న ఈషా రెబ్బాకి, మలయాళం నుంచి అవకాశం రావడం విశేషం. కుంచాకో బోబన్ హీరోగా నటించనున్న ఈ సినిమాలో కథానాయికగా ఆమెకి ఛాన్స్ లభించింది. ఫెల్లి దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో అరవింద్ స్వామి ఒక కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా ఫస్టు షెడ్యూల్ 'గోవా'లో మొదలు కానుంది.