ఓటీటీకి నయనతార మూవీ 'నెట్రికన్'!

Admin 2021-06-14 15:13:12 entertainmen
తెలుగు, తమిళ భాషల్లో నయనతారకి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. సినిమాలు తమిళంతో పాటు తెలుగులోను విడుదలవుతూ ఉంటాయి. ఇక నయనతార నుంచి నాయిక ప్రధానమైన సినిమా వస్తుందంటే, అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఆమె తాజా చిత్రంగా 'నెట్రికన్' రూపొందింది. విఘ్నేశ్ శివన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించాడు. థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అందుకు ఇంకా సమయం ఉండటంతో ఓటీటీలో వదలాలనే నిర్ణయానికి వచ్చారట. డిస్నీ హాట్ స్టార్ ద్వారా ఈ సినిమాను వచ్చే నెలలో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. భారీ ఆఫర్ కే విఘ్నేశ్ శివన్ ఈ సినిమాను ఇచ్చినట్టుగా చెప్పుకుంటున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ .. హారర్ థ్రిల్లర్ సినిమాలను అద్భుతంగా ఆవిష్కరించే దర్శకుడిగా మిళింద్ రావ్ కి మంచి పేరు ఉంది.