- Home
- tollywood
విడుదలకు సిద్ధంగా 'బ్యాచ్ లర్'
ప్రస్తుతం అఖిల్ సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక వచ్చేనెల నుంచి ఆయన తాజా చిత్రం మొదలుకానుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో .. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితం కానుంది. ఈ సినిమాకి 'ఏజెంట్' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో అఖిల్ డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేయనున్నట్టుగా తాజాగా ఒక వార్త షికారు చేస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు ఈ సినిమాను నిర్మించనున్నారని చెప్పుకుంటున్నారు. శ్రీను వైట్ల చెప్పిన కథ మైత్రీవారికి నచ్చిందని అంటున్నారు. ఇక అఖిల్ కి కథను వినిపించవలసి ఉందని చెబుతున్నారు. మైత్రీవారు ఆల్రెడీ అఖిల్ కి అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారనీ .. ఈ ప్రాజెక్టు ఆయన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.