తెలుగు, హిందీ సినిమాలతో పూజ హెగ్డే బిజీ

Admin 2021-07-01 17:30:12 entertainmen
టాలీవుడ్ లో ఈవేళ టాప్ హీరోయిన్లలో పూజ హెగ్డే ఒకరు. స్టార్ హీరోల సినిమాల నుంచి ఆమెకున్న డిమాండ్ మామూలు డిమాండ్ కాదు. పారితోషికం ఎంతైనా సరే.. ఆమె డేట్స్ ఇస్తే చాలనుకునే నిర్మాతలు చాలా మందే వున్నారు. ఇటు తెలుగులో నటిస్తూనే.. అటు హిందీ సినిమాలు కూడా చేస్తోంది. దాంతో ఆమె డేట్స్ అంత ఈజీగా దొరకడం కష్టమనే చెప్పాలి. ఇప్పటికే తెలుగులో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్', 'రాధేశ్యామ్' చిత్రాలను పూర్తిచేసి, 'ఆచార్య'లో చరణ్ సరసన నటిస్తోంది. హిందీలో 'సర్కస్', 'బైజాన్' సినిమాలు చేస్తోంది. ఇటీవలే తమిళంలో కూడా ఓ భారీ చిత్రానికి కమిట్ అయింది. స్టార్ హీరో విజయ్ కథానాయకుడుగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'బీస్ట్'. ఇప్పటికే ఓ షెడ్యూలును పూర్తిచేసుకున్న ఈ చిత్రం తాజా షెడ్యూలు ఈ రోజు చెన్నైలో మొదలైంది. విజయ్, పూజ జంటపై గోకులం స్టూడియోలో వేసిన భారీ సెట్స్ లో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ నిర్వహిస్తున్నాడు. ఈ షెడ్యూలును ఇరవై రోజుల పాటు నిర్వహించడానికి ప్లాన్ చేశారు.