- Home
- tollywood
తేజ సజ్జ జోడీగా శివాని రాజశేఖర్
కొత్తగా వచ్చిన యువ కథానాయకులలో తేజ సజ్జ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ఇటీవల ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన 'జాంబి రెడ్డి' సినిమా హిట్ తో ఈ కుర్రాడు దార్లో పడిపోయాడు. 'ఇష్క్ .. నాట్ ఎ లవ్ స్టోరీ' సినిమా విడుదలకి సరైన సమయం కోసం చూస్తోంది. ఈ సినిమాకంటే ముందుగానే మల్లిక్ రామ్ అనే కొత్త దర్శకుడి సినిమాను పూర్తి చేశాడు. ఈ సినిమాలో ఆయన జోడీగా శివాని రాజశేఖర్ నటించింది. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేశారు. 'అద్భుతం' అనే టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. సృజన్ - చంద్రశేఖర్ నిర్మించిన ఈ సినిమాకి, రధన్ సంగీతాన్ని అందించాడు. లక్ష్మీ భూపాల్ స్క్రీన్ ప్లే - మాటలు అందించాడు. త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు.