- Home
- tollywood
రవితేజ కోసం కథ రెడీ
ఇటు యూత్ పల్స్ .. అటు మాస్ పల్స్ బాగా తెలిసిన దర్శకుల జాబితాలో నక్కిన త్రినాథరావు ఒకరు. ఒక కథలో ఏయే అంశాలు ఎంతవరకూ ఉండాలనే విషయం ఆయనకి బాగా తెలుసు. ఇంతకుముందు ఆయన తెరకెక్కించిన 'సినిమా చూపిస్త మావ' .. 'నేను లోకల్' సినిమాలు అందుకు నిదర్శనంగా నిలుస్తాయి. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఆ తరువాత ఆయన నుంచి మరో సినిమా రాలేదు. ఈ నేపథ్యంలో రవితేజ హీరోగా ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి.