బ్యూటీ సినిమాలు మానేసి పలు టీవీ సీరియల్స్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది

Admin 2021-07-02 18:12:12 entertainmen
‘నువ్వు నేను’ సినిమా అప్పట్లో కుర్రకారును ఒక ఊపు ఊపింది. కుర్రాళ్లు మనసుల్లో ఎప్పటికీ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది బ్లాక్ బ్యూటీ ‘అనిత’. స్టార్ హీరోయిన్ గా మాత్రం ఎదగలేక పోయింది. అయితే, ఈ బ్యూటీ సినిమాలు మానేసి పలు టీవీ సీరియల్స్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. అనిత తరచూ తనకు సంబంధించిన విషయాలను, విశేషాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన ఫాలోవర్స్ కి మంచి టైమ్ పాస్ కంటెంట్ ఇస్తోంది. అనిత తన భర్తను ఆటపట్టిస్తూ ఉండగా దాన్ని వీడియో తీశారు. ఆ వీడియోని అనిత సోషల్ మీడియాలో షేర్‌ చేసింది. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంది. అన్నట్టు తాజాగా అనిత తన భర్తతో క్లోజ్‌గా తీసుకున్న ఫోటో ఒకదాన్ని పోస్ట్ చేసింది.