- Home
- tollywood
మెహరీన్ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది
మెహరీన్ కి, హరియాణ మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య బిష్ణోయ్ తో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిగింది. తాజాగా మెహరీన్ షాకింగ్ విషయాన్ని రివీల్ చేసింది. భవ్య బిష్ణోయ్‌తో తను పెళ్లిపీటలు ఎక్కడం లేదని, నిశ్చితార్థంకు బ్రేకాఫ్ చెప్పినట్లుగా మెహరీన్ ట్వీట్ చేసింది. ‘భవ్య బిష్ణోయ్ నేను కలిసి మా నిశ్చితార్థాన్ని విరమించుకోవాలనుకున్నాము. కొన్ని కారణాల వల్ల మా బంధం పెళ్లి వరకు వెళ్లడం లేదని తెలియజేస్తున్నాను. ఇందులో ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పటి నుంచి భవ్య బిష్ణోయ్‌తో గానీ, అతని ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో గానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక నేను ఎటువంటి ప్రకటన చేయాలనుకోవడం లేదు. మీకు తెలుసు, ఒక పెళ్లి వెనుక ఎన్నో విషయాలు ఉంటాయి. దయచేసి ఇది నా పర్సనల్ విషయంగా భావించండి. ఇకపై నటిగానే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. నా తదుపరి ప్రాజెక్ట్ ల పై ప్రస్తుతం దృష్టి పెట్టాను.