- Home
- tollywood
ఇంతలోనే 'ఎఫ్ 3' షూటింగ్ కు హాజరు
మెహ్రీన్ తన నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. తన ప్రియుడు, హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయితో అనుబంధాన్ని తెంచుకుంటున్నట్టు ప్రకటించి అందరికీ షాకిచ్చింది. 'ఎఫ్ 3' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెట్లో వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, సునీల్ తదితరులతో కలిసి దిగిన ఫొటోను మెహ్రీన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేసింది. 'ఎఫ్ 3' ఫ్యామిలోకి తిరిగొచ్చానని ఆ ఫొటో కు క్యాప్షన్ పెట్టింది. తన నిశ్చితార్థం రద్దయిన తరుణంలో సినిమా సెట్స్ లో ఆమె సంతోషంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమాకు సీక్వెల్ గా 'ఎఫ్ 3' నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సునీల్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నాడు.