- Home
- tollywood
పట్టాలపైకి రామ్ ప్రాజెక్టు
రామ్ తన తాజా చిత్రాన్ని తమిళ దర్శకుడు లింగుస్వామితో చేయనున్నాడు. కొంతకాలంగా ఈ సినిమాకి సంబంధించిన సన్నాహాలు జరుగుతూ వస్తున్నాయి. షూటింగు ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అనే ఆత్రుతలో ఉన్నట్టుగా ఇటీవల రామ్ ట్వీట్ చేశాడు కూడా. అయితే జ్ఞానవేల్ రాజా .. లింగుస్వామి మధ్య పాత లావాదేవీలు తెరపైకి వచ్చాయి. కానీ ఈ సినిమా షూటింగు త్వరలో మొదలవుతుందని అంటున్నారు. ఫస్టు షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారు. సారథి స్టూడియోలో ఒక సాంగ్ షూటింగుతో ఈ షెడ్యూలు మొదలుకానుంది. సారథి స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించనున్నారు. ఈ షెడ్యూల్లో రామ్ తో పాటు కథానాయికగా కృతి శెట్టి కూడా పాల్గొననుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడం ఖాయమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.