పుష్ప తాజా షెడ్యూల్ హైదరాబాద్ లోనే

Admin 2021-07-07 11:04:12 entertainmen
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. చాలావరకూ ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. అయితే కరోనా కారణంగా కొన్ని రోజుల క్రితం షూటింగును ఆపేశారు. అప్పటి నుంచి కూడా అలా రోజులు గడుస్తూ వచ్చాయి. కరోనా తీవ్రత తగ్గిన కారణంగా మళ్లీ షూటింగును మొదలుపెట్టాలనే ఉద్దేశంతో, కొన్ని రోజులుగా ఆ దిశగా సన్నాహాలు చేసుకుంటూ వచ్చారు. ఈ రోజున మళ్లీ సెట్స్ పైకి వెళ్లారు. ఈ రోజు నుంచి 45 రోజుల వరకూ నాన్ స్టాప్ గా షూటింగు జరిగేలా ప్లాన్ చేశారని అంటున్నారు. ఈ షెడ్యూల్ తో 'పుష్ప' పార్టు 1కి సంబంధించిన షూటింగు పార్టు పూర్తవుతుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తెలుగు తెరకి మాలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ పరిచయమవుతున్నాడు.