బిగ్ బాస్ 5 సీజన్లో యాంకర్‌ సిరి హన్మంత్‌ !

Admin 2021-07-08 12:56:12 entertainmen
బిగ్ బాస్ షో ఐదవ సీజన్ కు రెడీ వుతుంది. జూలైలో బిగ్ బాస్ సీజన్ 5 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఇక ఈ సీజన్ లో టాప్ కంటెస్టంట్స్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు. టిక్ టాక్ స్టార్ దుర్గా రావు హౌజ్ మేట్స్ గా వస్తారని టాక్. జబర్దస్త్ నుండి లాస్ట్ సీజన్ లో అవినాష్ ఎంట్రీ తెలిసిందే. ప్రముఖ బుల్లితెర నటి, యాంకర్‌ సిరి హన్మంత్‌ కూడా బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందంటూ ప్రచారం జరుగుతోంది. మొదట్లో యాంకర్‌గా మెరిసిన సిరి తర్వాత సీరియల్స్‌ వైపు అడుగులేసి నటిగా రాణిస్తోంది. ఆమెకు బిగ్‌బాస్‌ నుంచి పిలుపు వచ్చిందట మరి ఈ ఆఫర్‌ను ఆమె అంగీకరిస్తుందా? తిరస్కరిస్తుందా? అనేది వేచి చూడాల్సిందే.