'రాక్షసుడు' సీక్వెల్ కి రంగం సిద్ధం

Admin 2021-07-13 22:06:12 entertainmen
సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలలో 'రాక్షసుడు' ఒకటి. బెల్లంకొండ శ్రీనివాస్ - అనుపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమా 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రమేశ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ప్రేక్షకులను భయపెట్టేసింది. టీనేజ్ అమ్మాయిల వరుస హత్యల చుట్టూ తిరిగే కథతో రూపొందిన ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. రాక్షసుడు 2' సినిమాకి 'హోల్డ్ యువర్ బ్రీత్' అనే ట్యాగ్ లైన్ ఉంచారు. కొత్తగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉంది. సైకో కిల్లర్ ఒక చేత్తో గొడ్డలి పట్టుకుని, మరో చేత్తో ఒక శవాన్ని భుజాన వేసుకుని వెళుతున్న దృశ్యం ఈ పోస్టర్ లో కనిపిస్తోంది. సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో, ఈ సారి హీరో మారనున్నాడు. హీరో ఎవరనేది త్వరలోనే ప్రకటిస్తారట.