అమెజాన్ ప్రైమ్ కి 'నారప్ప'

Admin 2021-07-13 22:10:12 entertainmen
వెంకటేశ్ కథానాయకుడిగా చిత్రీకరణ పూర్తిచేసుకున్న రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఒకటి 'నారప్ప' అయితే, మరొకటి 'దృశ్యం 2'. తమిళ సినిమా 'అసురన్'కి రీమేక్ గా 'నారప్ప' రూపొందింది. తక్కువ బడ్జెట్లో .. తక్కువ సమయంలో ఈ సినిమాను పూర్తి చేశారు. 'దృశ్యం 2' సినిమాను కూడా ఓటీటీలోనే విడుదల చేయనున్నారనే టాక్ వచ్చింది. ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ వారికే ఇవ్వనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత డిస్నీ హాట్ స్టార్ వారితో చర్చలు జరుగుతున్నట్టుగా చెప్పుకున్నారు. వాళ్లతోనే డీల్ కుదిరిందనేది తాజా సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన రావలసి ఉంది. మలయాళ 'దృశ్యం 2' కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైనే విడుదలై అనూహ్యమైన విజయాన్ని అందుకుంది.