బాలకృష్ణ చేయవలసిన కథతోనే గోపీచంద్

Admin 2021-07-17 12:43:12 entertainmen
గోపీచంద్ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే, బాలకృష్ణ చేయవలసిన కథతోనే ఇప్పుడీ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రకథను బాలకృష్ణకు చెప్పాడనీ, అయితే అది వర్కౌట్ కాలేదని, ఇప్పుడీ కథ గోపీచంద్ కు నచ్చడంతో ఈ ప్రాజక్ట్ పట్టాలెక్కుతోందని తెలుస్తోంది.