వానల కారణంగా 'పుష్ప' కోసం వేసిన సెట్లు దెబ్బతిన్నాయట!

Admin 2021-07-17 13:11:12 entertainmen
అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' రూపొందుతోంది. కరోనా కారణంగా మొన్న మొన్నటివరకూ ఈ సినిమా షూటింగు ఆపేశారు. ఆ తరువాత కరోనా ప్రభావం తగ్గడంతో రంగంలోకి దిగిపోయారు. 45 రోజుల షెడ్యూల్ ను పకడ్బందీగా ప్లాన్ చేశారు. షూటింగు మొదలుపెట్టిన తరువాత ఆగకుండా నాన్ స్టాప్ గా జరపాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా పడుతున్న వానల కారణంగా 'పుష్ప' కోసం ఓపెన్ ఏరియాలో వేసిన సెట్లు దెబ్బతిన్నాయట. అందువలన ప్రస్తుతానికి షూటింగు ఆపేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఈ కారణంగా ఈ షెడ్యూల్ కొంత ఆలస్యంగా పూర్తికావొచ్చని అంటున్నారు. త్వరలోనే ఈ సినిమా షూటింగులో ఫాహద్ ఫాజిల్ పాల్గొననున్నాడు. ఆల్రెడీ ఆయన హైదరాబాద్ వచ్చాడని చెబుతున్నారు.