'శ్యామ్ సింగ రాయ్' షూటింగు పూర్తి

Admin 2021-07-26 13:05:12 entertainmen
నాని ఈ ఏడాది ఎంచుకున్న కథలు చాలా విభిన్నమైనవి. వాటిలో 'శ్యామ్ సింగ రాయ్' ఒకటి. ఈ కథ .. కథనం చాలా డిఫరెంట్ గా ఉండనున్నాయి. టైటిల్ .. నాని లుక్ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తూ వస్తున్నాయి. కథా నేపథ్యం కారణంగా ఈ సినిమాను ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో చిత్రీకరించారు. సెట్ లో షూటింగు కావడం వల్లనే, కరోనా తీవ్రంగా ఉన్న సమయంలోను, జాగ్రత్తలు పాటిస్తూ షూటింగు కానిచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తిచేయగలిగారు. నాని సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతి శెట్టి నటించారు. ఒక ప్రత్యేకమైన పాత్రలో మడోన్నా సెబాస్టియన్ కనిపించనుంది. కీలకమైన పాత్రను జిషు సేన్ గుప్తా పోషించాడు. ఈ సినిమాను సంక్రాంతి బరిలో దింపే అవకాశాలు కనిస్తున్నాయి.