- Home
- sports
Tokyo 2020: నిరాశపరిచిన మహిళా రెజ్లర్లు
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, గురువారం జరిగిన మహిళల 53 కేజీల క్వార్టర్ ఫైనల్లో వినేశ్ ఫొగాట్ ఓటమి పాలవ్వగా.. రేపిచేజ్ ద్వారా వచ్చిన సువర్ణవకాశాన్ని అన్షు మాలిక్ చేజార్చుకుంది. మహిళల 57 కేజీల ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో అన్షు మాలిక్ రెపిచేజ్ రౌండ్లో ఓటమి పాలైంది. రష్యా ఒలింపిక్స్ కమిటీ క్రీడాకారిణి కొబ్‌లొవా చేతిలో 1-5 తేడాతో చిత్తయింది. తొలి పిరియడ్‌లో కొబ్‌లొవా 1 పాయింటు సాధించి ముందుకెళ్లింది. ఇక రెండో పిరియడ్‌లోనూ పోరు హోరాహోరీగా సాగింది. అన్షు కాళ్లను లక్ష్యంగా ఎంచుకున్న కొబ్‌లొవ్ వరుసగా ఫిట్లే కు గురిచేసి 4 పాయింట్లు సాధించింది. దాంతో మాలిక్‌కు పుంజుకునే అవకాశం దక్కలేదు. భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 53కేజీల విభాగంలో క్వార్టర్ ఫైనల్లో ఓటమిపాలైంది. బెలారస్ క్రీడాకారిణి వనేసా చేతిలో పరాజయం చెందింది.