- Home
- tollywood
'పాగల్' నాకు నచ్చిన కథ
పాగల్ సినిమాలో కథానాయికగా నివేదా పేతురాజ్ నటించింది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి నివేదా పేతురాజ్ మాట్లాడింది. కొంతకాలం క్రితం నరేశ్ కుప్పిలి చెన్నైకి వచ్చి నన్ను కలిశారు 'పాగల్' సినిమా గురించి వచ్చానని చెబుతూ, ఆ కథను నాకు వినిప్పించారు. కథ వినగానే నేను కనెక్ట్ అయ్యాను. నా పాత్ర గురించి ఆయన చెబుతున్నప్పుడు నిజంగానే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. నరేశ్ గారు వెళ్లిపోయిన తరువాత కూడా నేను ఆ కథను గురించి ఆలోచిస్తూ ఉండిపోయాను.