నా సినిమాను నాకు థియేటర్లలోనే చూసుకోవాలని ఉంటుంది : నాని

Admin 2021-08-19 14:59:12 ENT
నాని - శివ నిర్వాణ కాంబినేషన్లో కలిసి చేసిన సినిమా 'టక్ జగదీష్' .సాహు గారపాటి - హరీశ్ పెద్ది ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించారు.

గ్రామీణ నేపథ్యంలో సాగే కథ. ఈ సినిమాలో నాని సరసన నాయికగా రీతూ వర్మ నటించగా, ఆయన అన్నయ్య పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఈ సినిమా థియేటర్లకు వస్తుందా? ఓటీటీకి వెళుతుందా? అనే సందిగ్ధంలో అభిమానులు ఉన్నారు. ఈ విషయంపై తాజాగా నాని స్పందించాడు. 'నా సినిమాను నాకు థియేటర్లలోనే చూసుకోవాలని ఉంటుంది. థియేటర్లలో సినిమా చూస్తే కలిగే ఆనందం వేరు .. అనుభూతి వేరు. థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డు చూసినప్పుడు పొందే సంతోషం అంతా ఇంతా కాదు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వేరు.