సోనూ సూద్ రిప్లై తర్వాత ట్వీట్ డిలీట్ చేసిన నెటిజన్

Admin 2021-08-25 15:39:12 ENT
తనకు కోటి రూపాయలు ఉంటే ఇవ్వాలన్న ఓ నెటిజన్‌కు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. అంత కొద్ది మొత్తం సరిపోదేమోనని అనుమానం వ్యక్తం చేశాడు. కరోనా సమయంలో దేశ ప్రజలకు అండగా నిలిచిన సోనూ సూద్ ఆపన్నహస్తం అందించి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపాడు. "సోనూ సర్.. కోటి రూపాయలు ఉంటే ఇవ్వండి సార్" అని ట్వీట్ చేశాడు. వెంటనే స్పందించిన సోనూ.. "మహేంద్రా, కోటి రూపాయలు ఎక్కడికి సరిపోతాయి.. ఇంకాస్త ఎక్కువ అడగాల్సింది" అంటూ లాఫింగ్ ఎమోజీతో రిప్లై ఇచ్చాడు. ఇక సోనూ రిప్లై చూసిన వెంటనే మహేంద్ర తన ట్వీట్‌ను డిలీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. కాగా, గతంలోనూ సోనూకు ఇలాంటి రిక్వెస్టులే వచ్చాయి. సోనూసూద్ తాజా రిప్లైపై కామెంట్ల వర్షం కురుస్తోంది.