ఈ నెల 10 నుంచి అమెజాన్ ప్రైమ్ లో - టక్ జగదీష్

Admin 2021-09-03 12:49:58 ENT
'టక్ జగదీష్' అమెజాన్ ప్రైమ్ లో ఈ నెల 10 వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది. 'వినాయకచవితి' రోజున ఈ సినిమా వస్తుండటం విశేషం. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. యూట్యూబ్ లో వదిలిన ఈ ట్రైలర్ కి విశేషమైన స్పందన లభిస్తోంది. ఈ ట్రైలర్ ఇంతవరకూ 5 మిలియన్స్ కి పైగా వ్యూస్ ను .. 168K ప్లస్ లైక్స్ ను సొంతం చేసుకుంది. నాని కెరియర్ లోనే ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయి వ్యూస్ ను, లైక్స్ ను సంపాదించుకున్న ట్రైలర్ ఇదేనని అంటున్నారు. కొత్త రికార్డుల దిశగా ఈ ట్రైలర్ దూసుకెళ్లడం ఖాయమని చెప్పుకుంటున్నారు. నాని సరసన నాయికగా రీతూ వర్మ నటించిన ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు.