- Home
- bollywood
గుండెపోటుతో సిద్ధార్థ్ మృతి సిద్ధార్థ్ శుక్లా
బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా(40) నిన్న గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహానికి ఈ రోజు ఉదయం ముగ్గురు వైద్యుల ఆధ్వర్యంలో పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. సిద్ధార్థ్ శరీరంపై ఎలాంటి గాయాలు లేవని శవపరీక్షలో తేలింది. హిస్టోపాథాలజీ జరిపిన తర్వాత వివరాలు తెలుస్తాయని అన్నారు. కాగా, బుల్లితెర నటుడిగా, బిగ్ బాస్ 13లో విజేతగానూ ప్రేక్షకులకు సిద్ధార్థ్ సుపరిచితుడు. కెరీర్‌లో మంచి అవకాశాలు వస్తోన్న సమయంలో ఆయన మృతి చెందారు.