ఒక్కో డ్రెస్ ధర రూ.2 లక్షలపైనే! : పూజ హెగ్డే

Admin 2021-09-15 12:57:20 ENT
పూజ హెగ్డే బాగా పాప్యులర్ అయిన హీరోయిన్స్‌లో ఒకరు.హిందీలో హృతిక్ రోషన్ సరసన కూడా నటించిందీమె. ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ప్రముఖ బ్రాండ్ అనీతా డోంగ్రే డ్రెస్‌లే ధరిస్తుంది. ఈ బ్రాండ్ ధర సామాన్యులకు అందనంత ఎత్తులో ఉంటుంది. ఎందుకంటే ఈ బ్రాండ్ డ్రెస్ ధర.. ఒక్కటి తీసుకుంటేనే కనీసం రూ.2 లక్షలు పలుకుతుంది. దీంతోపాటు ఫుట్‌వేర్ విషయానికొస్తే టిన్సెల్ టోస్ అనే బ్రాండ్‌ను పూజ బాగా ఇష్టపడుతుందిట. ఈ బ్రాండ్ ఫుట్‌వేర్ ప్రారంభ ధరే రూ.2500 ఉంటుంది. శరీరంపై ఉండే దుస్తులే రూ.2 లక్షలపైన ధర పలుకుతాయన్నమాట.