పాటల పనిలో బిజీగా చిరంజీవి

Admin 2021-09-16 09:19:48 ENT
భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, కేవలం రెండు పాటలు మాత్రమే పెండింగ్ ఉన్నాయని చెప్పారు. ఆ రెండు పాటలను చిత్రీకరించడానికి ఇప్పుడు రంగంలోకి దిగారు. చిరంజీవి - చరణ్ కాంబినేషన్లోని ఒక పాటను ఇప్పుడు చిత్రీకరిస్తున్నారు. వారం రోజుల పాటు ఈ పాటను షూట్ చేస్తారట. ఆ తరువాత ఈ నెల చివరివారంలో చరణ్ - పూజ హెగ్డే కాంబినేషన్లో ఒక డ్యూయెట్ ను చిత్రీకరిస్తారని అంటున్నారు. మణిశర్మ స్వరపరిచిన ఈ రెండు పాటలు ఇటు యూత్ ను .. అటు మాస్ ను ఒక ఊపు ఊపేస్తాయని చెబుతున్నారు.