నాగార్జున సరసన ఇలియానా!

Admin 2021-09-21 02:28:01 ENT
నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాకి 'ఘోస్ట్' అనే టైటిల్ ను రీసెంట్ గా ఖరారు చేశారు. ఈ సినిమాలో కథానాయికగా కాజల్ ను అనుకున్నారు. అయితే కాజల్ ఇప్పుడు ప్రెగ్నెంట్ .. ఆమె సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపడం లేదనే టాక్ వినిపిస్తోంది. 'ఆచార్య' సినిమా షూటింగును పూర్తిచేసుకుంది కనుక బెంగలేదు. 'ఇండియన్ 2' సినిమా ఆగిపోయింది కనుక కంగారు లేదు. ఈ సినిమాలో కథానాయికగా త్రిషనుగానీ .. ఇలియానాను గాని తీసుకోవచ్చుననే టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ ఇద్దరిలో ఇలియానాను ఎంపిక చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. చివరికి ఎవరిని తీసుకుంటారనేది చూడాలి.