అక్కినేని నాగార్జున సమంత కాంప్లిమెంట్స్

Admin 2021-09-21 02:02:38 ENT
అక్కినేని నాగార్జున తన 'బంగార్రాజు' లుక్ ను విడుదల చేస్తూ, తన తండ్రిని గుర్తుచేసుకున్న సంగతి విదితమే. తండ్రిలా పొందూరు ఖద్దరు పంచెకట్టుకుని, తన తండ్రి వాడిన నవరత్నాల హారాన్ని ధరించి.. 'ఇప్పుడు నాన్న నాతోనే ఉన్నట్టుంది' అంటూ నాగ్ ఓ వీడియోలో అనుభూతి చెందారు. అలాగే ఆయన కోడలు, కథానాయిక సమంత కూడా స్పందిస్తూ..'ఇది సో బ్యూటిఫుల్ మామా' అంటూ నాగ్ లుక్ ను ప్రశంసించింది. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.