కొత్త కారుకు 9999 ఫ్యాన్సీ నంబర్ ను సొంత చేసుకున్న తారక్

Admin 2021-09-23 02:56:53 ENT
రిజిస్ట్రేషన్లలో ఫ్యాన్సీ నంబర్లకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఎంత ఖర్చైనా భరించి ఆ నంబర్లను సొంతం చేసుకోవడానికి కొందరు ప్రయత్నిస్తుంటారు. వారిలో సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒకరు. 9999 నంబర్ ను తారక్ అమితంగా ఇష్టపడతాడు. టీఎస్09ఎఫ్ఎస్9999 నంబర్ ను ఆయన సొంతం చేసుకున్నాడు. హైదరాబాదులోని ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయంలో కొత్త సిరీస్ కు నిన్న వేలంపాట జరిగింది. ఈ వేలంపాటలో రూ. 17 లక్షలు వెచ్చించి 9999 నంబర్ ను సొంతం చేసుకున్నాడు.