ఓటీటీలో రిలీజ్ అవుతున్న 'భ్రమం'

Admin 0000-00-00 00:00:00 ENT
ప్రస్తుతం ఆమె నుంచి రావలసిన సినిమాలు అరడజను వరకూ ఉన్నాయి. తెలుగులో 'థ్యాంక్యూ' .. 'పక్కా కమర్షియల్' సినిమాలు చేస్తున్న ఆమె, తమిళ, మలయాళ సినిమాల్లోనూ తన జోరు పెంచడానికి రెడీ అవుతోంది. మలయాళంలో ఆమె తన రెండవ సినిమాగా 'భ్రమం' చేసింది. హిందీలో వచ్చిన 'అంధదూన్' సినిమాకి ఇది రీమేక్. మలయాళంలో రవి కె చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, కథానాయకుడిగా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించాడు. కథానాయికగా రాశి ఖన్నా నటించింది. అక్టోబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. 'అంధదూన్' రీమేక్ గా ఇటీవల తెలుగులో 'మాస్ట్రో' వచ్చిన విషయం తెలిసిందే.