- Home
- tollywood
కథపై కసరత్తు నడిచింది : శ్రీను వైట్ల
మహేశ్ బాబు కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన 'దూకుడు' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ రోజుతో ఈ సినిమా పదేళ్లను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ .. "ముందుగా నేను మహేశ్ బాబుతో ఒక దేశభక్తి సినిమాను చేయాలనుకున్నాను. కొంతకాలం పాటు ఆ కథపై కసరత్తు నడిచాక, కొన్ని సందేహాలకు సంతృప్తికరమైన సమాధానాలు లభించలేదు. దాంతో ఆ కథను పక్కన పెట్టేయవలసి వచ్చింది. మహేశ్ ను ఎమ్మెల్యే గా చూపిస్తే ఎలా ఉంటుందనే ప్రస్తావన వచ్చింది. అప్పుడు అల్లుకున్న కథనే 'దూకుడు'. ప్రకాశ్ రాజ్ పాత్రకి గాను ముందుగా శ్రీహరిని అనుకున్నాము. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. మహేశ్ కెరియర్లో చెప్పుకోదగిన హిట్ ఇచ్చినందుకు నాకు గర్వంగా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.