- Home
- tollywood
'పెళ్లిసందD'తో పరిచయం కానున్న శ్రీలీల
ఆ కన్నడ బ్యూటీ పేరే శ్రీలీల. 'పెళ్లి సందD' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ డైరెక్టర్ గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోషన్ జోడీగా శ్రీలీల నటించింది. ఎంతోమంది కొత్త కథానాయికలను పరిచయం చేసిన రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సుందరి పరిచయమవుతుండటం విశేషం. ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ బయటికి వస్తుండటంతో, ఈ అమ్మాయికి ఆఫర్లు బాగానే వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె రవితేజ సినిమాలో కథానాయికగా ఎంపిక అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'ఖిలాడి' సినిమాను విడుదలకు రెడీ చేస్తున్న రవితేజ, ఆ తరువాత సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు.