సమంత నుంచి రానున్న 'శాకుంతలం'

Admin 2021-10-08 10:36:18 ENT
రానున్న తాజా చిత్రంగా 'శాకుంతలం' మాత్రమే కనిపిస్తోంది. భారీ బడ్జెట్ తో గుణశేఖర్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా గ్రాఫిక్స్ పరమైన పనులను జరుపుకుంటోంది. శకుంతల చరిత్రగా నిర్మితమవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ లోగా విడాకులకు సంబంధించిన గొడవలే సరిపోయాయి. అయితే ఆమె చేతిలో మూడు ప్రాజెక్టులు ఉన్నాయనే టాక్ తాజాగా వినిపిస్తోంది. అవి ఏయే భాషలకు సంబంధించిన సినిమాలనే విషయంలో క్లారిటీ లేదు. వారం రోజుల్లో ఆమె ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు వెలువడే అవకాశాలు ఉన్నట్టుగా చెబుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఆ సినిమాలు మొదలైతే, మనసును ఆ వైపు మళ్లించవచ్చని ఆమె భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.