- Home
- tollywood
వరుస సినిమాలతో బిజీగా ధనుశ్
తమిళనాట ధనుశ్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. ఆయన సినిమాల్లో కొత్తదనం ఉంటుందని అభిమానులు నమ్ముతారు. విలక్షణమైన పాత్రలకు ఎక్కువగా ప్రాధాన్యతనిచ్చే ఆయన, అభిమానులతో ఎంతమాత్రం గ్యాప్ రాకుండా చూసుకుంటూ ఉంటాడు. తెలుగులోను ఆయన సినిమాలకి మంచి మార్కెట్ ఉంది.
ప్రస్తుతం ఆయన నుంచి ఒకదాని తరువాత ఒకటిగా రావడానికి ఓ అరడజను సినిమాలు రెడీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన మరో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాడు .. ఆ సినిమా పేరే 'నానే వరువేన్'. ఆయన సోదరుడు సెల్వ రాఘవన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సినిమా రెగ్యులర్ షూటింగు ఈ రోజున మొదలైంది. ఆ సందర్భంగా ఈ సినిమా నుంచి ధనుశ్ ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు. కౌబోయ్ గెటప్పులో హంటర్ లా ఆయన ఈ పోస్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన హీరోగా .. విలన్ గా ద్విపాత్రాభినయం చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది.