'భీమ్లా నాయక్' నుంచి టీజర్!

Admin 2021-10-28 03:51:28 ENT
పవన్ కల్యాణ్ - రానా ప్రధాన పాత్రధారులుగా 'భీమ్లా నాయక్' సినిమా రూపొందుతోంది. పవన్ సరసన నాయికగా నిత్యామీనన్ నటిస్తుండగా .. రానా జోడీగా సంయుక్త మీనన్ అలరించనుంది.

ఈ సినిమా నుంచి వచ్చిన పవన్, రానా పాత్రల తాలూకు వీడియోస్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల పవన్ - నిత్యామీనన్ కాంబినేషన్లోని పాటను వదిలిన విషయం తెలిసిందే. ఇక దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను వదిలే ఆలోచనలో ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.