'ఆచార్య' నుంచి సెకండ్ సింగిల్

Admin 0000-00-00 00:00:00 ENT
కొరటాల శివ దర్శకత్వంలో 'ఆచార్య' సినిమా రూపొందింది. అవినీతి అధికారులపై సమరశంఖం పూరించిన బాధ్యతగల ఒక పౌరుడి కథ ఇది. మాటలతో చెబితే అర్థంకాని అవినీతిపరుల గుండెల్లో తూటాలు నాటిన ఒక వీరుడి కథ ఇది. అలాంటి ఈ సినిమా నుంచి ఆ మధ్య వచ్చిన ఫస్టు సింగిల్ కి రికార్డు స్థాయి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో సిద్ధ పాత్రలో చరణ్ .. నీలాంబరి పాత్రలో పూజ హెగ్డే మరో జోడీగా కనిపించనున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లోని సాంగ్ ను సెకండ్ సింగిల్ గా కొంతసేపటి క్రితం రిలీజ్ చేశారు. 'నీలాంబరి .. నీలాంబరి .. వేరెవ్వరే నీలామరి, అయ్యోరింటి సుందరి .. వయ్యారాల వల్లరి .. నీలాంబరి' అంటూ ఈ పాట సాగుతోంది.