నాలుగు రోజుల క్రితమే మైనర్ సర్జరీ

Admin 2021-11-05 03:53:40 ENT
జూనియ‌ర్ ఎన్టీఆర్ ఇటీవల తన ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తుండగా ఆయన కుడిచేతి వేలుకి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో నాలుగు రోజుల క్రితమే ఆయ‌న మైనర్ సర్జరీ చేయించుకున్నార‌ని సమాచారం. కొన్ని రోజుల పాటు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న‌కు వైద్యులు సూచించారు. నిన్న ఎన్టీఆర్ త‌న కుమారుల‌తో కలిసి దిగిన ఫొటోలోనూ కుడి చేతికి బ్యాండేజీతో కనిపించాడు. త్వరలో కొరటాల శివ దర్శ‌క‌త్వంలో రూపొందే చిత్రం షూటింగ్ ప్రారంభించనున్నారు.