- Home
- bollywood
తండ్రీకొడుకులు తొలిసారి స్క్రీన్ షేర్
బాలీవుడ్ స్టార్ హీరో అనిల్ కపూర్ తన సుపుత్రుడు హర్షవర్ధన్ కపూర్ తో కలిసి తొలిసారి స్క్రీన్ షేర్ చేసుకుంటూ నటించిన చిత్రం థార్. రాజ్ సింగ్ చౌదరి డైరెక్షన్లో క్రైం థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ను నెట్ ఫ్లిక్స్ కు సంబంధించిన యూట్యూబు ఛానెల్ లో విడుదల చేసారు. ఈ మూవీలో అనిల్ కపూర్ ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ గా కనిపించబోతున్నారు.
రాజస్థాన్ లోని ఒక గ్రామంలో జరిగిన మర్డర్ మిస్టరీ ని ఛేదించబోయే క్రమం,లో అదే ఊరికి కొన్ని కళాఖండాలను కొనుక్కోవడానికి వచ్చిన హర్షవర్ధన్ వస్తాడు. హర్షవర్ధన్, అనిల్ కపూర్ కలిసి మర్డర్ మిస్టరీ ని ఎలా సాల్వ్ చేసారు? ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? వంటి ఆసక్తికర సంఘటనలతో రూపొందిన ఈ చిత్రం మే 6 నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.
ట్రైలర్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠగా సాగింది. దీంతో ప్రేక్షకులు ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాకపోతే, ఈ ట్రైలర్ లో అనిల్ కపూర్, హర్షవర్ధన్ కపూర్ లు ఒక్క ఫ్రెమ్ లో కూడా కలిసి కనిపించకపోవటంతో అభిమానులు ఒకింత నిరాశ చెందారు. కానీ సినిమాలోనైనా వారిద్దరి కాంబోలో సీన్లుంటాయని ఆశిస్తున్నారు. పోతే... ఫాతిమా సనా షేక్ హీరోయిన్ గా నటిస్తుంది. గ్రామీణ రాజస్థానీ యువతి లాగా ఆమె కనిపించబోతుంది.