- Home
- tollywood
కేజీఎఫ్ 2 సంచలన రికార్డు...
కేజీఎఫ్ చిత్రాన్ని కన్నడ చిత్ర పరిశ్రమకే ఒక మైలురాయిగా పరిగణించవచ్చు. ఎందుకంటే... కేజీఎఫ్ చిత్రానికి ముందు కన్నడ చిత్ర పరిశ్రమ గురించి దేశమంతటా పలురకాలుగా మాట్లాడుకునేవారు. కన్నడ వారు కథా బలం లేని సినిమాలను చాలా తక్కువ పరిధిలో నిర్మిస్తారనీ, సాంకేతికంగా కూడా అంత సామర్ధ్యమున్న నిపుణులు కన్నడనాట లేరని మాట్లాడుకునేవారు. కానీ ఇప్పుడు అదే పరిశ్రమ నుండి వచ్చిన కేజీఎఫ్ కన్నడ చిత్ర పరిశ్రమ పై జనాలకున్న అపోహలను, తక్కువ చూపును ఒక్కసారిగా పోగొట్టింది. తాము కూడా మంచి కంటెంట్ ఉన్న సినిమాలను, టెక్నికల్ గా ఉన్నతమైన సినిమాలను తీయగలమని కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ నీల్ ప్రపంచమంతటా ఎలుగెత్తి చెప్పారు.
శాండల్ వుడ్ లో ఇప్పటికే వంద, రెండొందల కోట్లను దాటేసి రూ. 300కోట్ల క్లబ్ లో చేరిన తొలి సినిమాగా నిలిచింది. ఇక తొందర్లోనే రూ. 400, రూ. 500 కోట్ల క్లబ్ లలో చేరే విధంగా ఈ సినిమా ప్రదర్శింపబడుతోంది.
దేశవ్యాప్తంగా కూడా ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుంది. ఉత్తరాదిన ఈ సినిమా సెన్సేషన్ తొలిరోజు వసూళ్లను సాధించి అక్కడి సినిమాలకు సవాలుగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నాలుగురోజుల్లోనే రూ. 500కోట్ల క్లబ్ లో చేరిన ఈ సినిమా లాంగ్ రన్ లో వెయ్యి కోట్లకు మించి సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఒకవేళ ఇలా జరిగితే, కేజీఎఫ్ సినిమా కన్నడ చిత్ర పరిశ్రమకు, టెక్నిషియన్స్ కు ఎంతో స్ఫూర్తినిస్తుంది.