- Home
- tollywood
కేజీఎఫ్ 2 మ్యూజిక్ డైరెక్టర్... పాండెమిక్ లో ఏం చేసారో తెలిస్తే షాకవుతారు...!
కరోనా కారణంగా భారత దేశ ఆర్ధికవ్యవస్థ బాగా దెబ్బతింది. ఆ టైం లో అన్ని వ్యవస్థలు మూతపడటంతో చిత్రసీమ కూడా ఎవరి సొంతిళ్లకు వాళ్ళు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఆ సమయంలో కొంతమంది సెలెబ్రిటీలు యూట్యూబు ఛానెల్స్ క్రియేట్ చేసి తెగ హంగామా చేస్తే, మరికొందరు సొంత పంటలను పండించుకుంటూ, కుటుంబసభ్యులతో కాలక్షేపం చేసారు. ఈ రెండో కేటగిరీకే చెందుతారు కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్.
కరోనా లాక్ డౌన్ టైం లో పేదలు, మధ్యతరగతి వారి పరిస్థితి ఎంతో దయనీయంగా ఉండేది. పూట గడవడానికి కూడా ఇబ్బంది పడేవారు.
అలానే తన తండ్రి రోజువారీ కూలీ రూ. 35 సంపాదించటానికి రవి బస్రుర్ కొలిమిలో కష్టపడి పనిచేశారట. లాక్ డౌన్ లో కన్నడ చిత్రపరిశ్రమ కూడా మూత పడటంతో మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రుర్, ఉడిపి జిల్లాలోని కుందపురా తాలూకా గ్రామంలో ఉంటున్న తన తల్లితండ్రుల ఇంటికి వెళ్ళాడు. అప్పుడు రవి బస్రుర్ తన తండ్రికి సహాయం చేద్దామనుకుని కొలిమి పని చేసాడు. ఈ మేరకు ఆయన పని చేస్తున్న కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి.
కేజీఎఫ్ 2 కి రవి బస్రుర్ ఎంతో అద్భుతమైన సంగీతాన్ని అందించారు. సినిమా విజయంలో మ్యూజిక్ కూడా ఒక కీలకపాత్ర పోషించిందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ సినిమాతో రవి బస్రుర్ పేరు టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది. కేజీఎఫ్ సినిమా దేశవ్యాప్తంగా ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిన విషయమే. మరి అంతటి గొప్ప సంగీత దర్శకుడు, ఎటువంటి ఈగో, యాటిట్యూడ్ చూపించకుండా దినసరి కూలి గా పనిచేసి తన తల్లిదండ్రులకు సహాయపడటంతో రవి బస్రుర్ మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు.
అంతకుముందు బాలీవుడ్ కండలవీరుడు నటించిన అంతిమ్ చిత్రానికి సంగీతం అందించిన రవి బస్రుర్, ప్రశాంత్ నీల్ కు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారారు.