- Home
- tollywood
మ్యూజిక్ మ్యాస్ట్రో గా పిలవబడే ఇళయరాజా గారు రాజకీయాల్లోకి...?
ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో గా పిలవబడే ఇళయరాజా గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు చిత్రసీమలో జోరుగా ప్రచారం జరుగుతుంది. అందుకు ముఖ్యకారణం ఏంటంటే... అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇళయరాజా చేసిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అంబేద్కర్ అండ్ మోడీ రిఫార్మ్స్ ఐడియాస్ పర్ఫార్మర్స్ ఇంప్లిమెంటేషన్ అనే పుస్తకానికి ముందుమాట రాసిన ఇళయరాజా, అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చటంలో మోడీ ఘనవిజయం సాధించారని ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇళయరాజా ఆరెస్సెస్ ఏజెంట్ గా మారారని, అందుకే మోడీ భజన చేస్తున్నారని తమిళనాడులోని అధికార పార్టీ ప్రతినిధులు ఆయనపై దుమ్మెత్తిపోశారు. ఈ నేపథ్యంలో ఇళయరాజాను ప్రధాన మంత్రి ఎంపీ పదవితో సత్కరిస్తారని సోషల్ మీడియాలో పలు చర్చలు జరుగుతున్నాయి. సుబ్రహ్మణ్య స్వామి పదవీకాలం ముగియనుండటంతో ఆయన స్థానంలో ఇళయరాజాకు పార్లమెంటు ఎంపీగా అవకాశం ఇవ్వాలని, ఈ మేరకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ఈ వార్తను రాష్త్రపతి అధికారికంగా ప్రకటించనున్నారంటూ విస్తృత ప్రచారం జరుగుతుంది.