రియల్ అండ్ రీల్ జీవితం తెరచిన పుస్తకం వంటిది... ఎవరో తెలుసా...?

Admin 2022-04-18 10:17:43 ENT
సంజయ్ దత్... హీరోగా తెరంగేట్రం చేసి ఎన్నో విజయాలు సాధించి, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీగా ఉన్న బాలీవుడ్ స్టార్ యాక్టర్. తాజాగా ఆయన కేజీఎఫ్ 2 చిత్రంలో క్రూరమైన విలన్గా నటించి మెప్పించారు.

సంజయ్ దత్ రియల్ అండ్ రీల్ జీవితం తెరచిన పుస్తకం వంటిది. ఆయన జీవితంలో ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఆఖరికి జైలు జీవితాన్ని కూడా అనుభవించారు. ఒకానొక సమయంలో డ్రగ్స్ కు తీవ్ర బానిసగా మారటంతో ఇక, సంజు సినీ కెరీర్ కు ఎండ్ కార్డ్ పడిద్దని అంతా అనుకున్నారు. కానీ ఈ అలవాటు నుండి బయటపడాలని ప్రయత్నించిన సంజయ్ డ్రగ్స్ రీహాబిలిటేషన్ సెంటర్ కు వెళ్లి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఇండస్ట్రీ కు తిరిగొచ్చాక చాలామంది ఆయన్ని డ్రగ్గీ అని పిలిచేవారట. నాటి అనుభవాల గురించి సంజయ్ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

అమ్మాయిలతో మాట్లాడాలంటే తెగ సిగ్గుపడిపోయే సంజూ, వారితో కూల్ గా మాట్లాడటం కోసమే డ్రగ్స్ ను అలవాటు చేసుకున్నాడట. అలా డ్రగ్స్ తీసుకోవటం మొదలుపెట్టిన సంజయ్ క్రమేపి వాటికి బానిసగా మారాడట. రీహాబిలిటేషన్ నుంచి తిరిగొచ్చిన తనని అందరూ డ్రగ్గీ అని ముద్రవేయటంతో, ఆ మచ్చ పోగొట్టుకోటానికి ఏదైనా చెయ్యాలని భావించి, కష్టపడి బాడీని బిల్డప్ చేసుకున్నాడట. ఇక అప్పటినుండి అందరూ సంజయ్ ను మెచ్చుకుంటూ, సినిమాలలో వరస అవకాశాలను ఇస్తున్న విషయం తెలిసిందే.