మొదలైన 'ఆచార్య' ప్రమోషన్స్

Admin 2022-04-19 11:00:26 ENT
ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. 'ఆచార్య' రీ షూట్లు జరుపుకున్నట్టుగా వార్తలు వచ్చాయి .. అది నిజమేనా? అనే ప్రశ్న కొరటాలకి ఎదురైంది. అందుకు ఆయన స్పందిస్తూ .. "ఈ సినిమాకి రీ షూట్లు చేయవలసిన అవసరం రాలేదు. అయినా, రీ షూట్లు చేయడమనేది అపరాథమైనట్టుగా చూడకూడదు .. మాట్లాడకూడదు.

దర్శకుడు తాను అనుకున్న సీన్ అనుకున్నట్టుగా రాలేదని ఫీలైతే రీ షూట్ కి వెళ్లడంలో తప్పులేదు. ఆశించిన స్థాయిలో సీన్ రాకపోయినా, ఫరవాలేదులే అని సర్దుకుపోతే అది తప్పు అవుతుంది.