- Home
- tollywood
'పుష్ప 2'లో డాన్స్ కోసం బన్నీ లుక్ మార్చేస్తున్నారట!
త్వరలో సెకండ్ పార్టుగా 'పుష్ప 2' సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో మొదటి పార్టులో కనిపించిన దానికి భిన్నంగా బన్నీ లుక్ ఉంటుందని అంటున్నారు.
పుష్ప సంపాదన పరుడు అవుతున్న కొద్దీ ఆయన తన స్టైల్ మార్చేసుకుంటూ రావడం ఫస్టు పార్టులోనే చూపించారు.
సెకండ్ పార్టు మధ్యకి వచ్చేసరికి పుష్ప లుక్ .. ఆయన స్టైల్ పూర్తిగా మారిపోతాయని అంటున్నారు. ఫస్టుపార్టులో పుష్ప పాత్రను డిజైన్ చేసిన తీరు వలన ఆయనలోని డాన్సర్ కి కళ్లెం వేసినట్టు అయింది. ఈ సారి బన్నీ మార్కు డాన్సులు ఉంటాయని సమాచారం. మరి ఆ పాత్రలోని లోపాలను సరిచేస్తారా? లేదంటే ప్రేక్షకులను ఊహాలోకంలోకి తీసుకుని వెళతారా? అనేది చూడాలి.